Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 1, 2026Short Read
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు!
క్విక్ టుడే న్యూస్,ఏపీ :- ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసు కేసు నమోదైంది.
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలతో టీడీపీ నేత మద్దిరాల ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేశారు.కేంద్ర మంత్రి పెమ్మసానికి సంకెళ్లు వేసినట్లుగా AI సాంకేతికతతో ఓ ఫేక్ వీడియోను అంబటి రూపొందించారని మద్దిరాల తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి సీఐడీ కార్యాలయంలో అంబటిపై కేసు నమోదైనట్లు సమాచారం.
ఈ పరిణామంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.





